గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి పల్లకి సేవ, రథయాత్రలో పాల్గొన్న

25-09-2026 | 09:28pm

 ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, సెప్టెంబర్ 25 : సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో(Sri Siddhi Ganapathi Temple) వినాయక చవితి(Vinayaka Chavithi) పర్వదినం పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం సాయంత్రం దేవాలయంలో నిర్వహించిన స్వామివారి పల్లకి సేవ, రథయాత్ర కార్యక్రమాల్లో(Rath Yatra program) ముఖ్యఅతిథిగా పాల్గొని.. స్వామివారికి ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Patancheru MLA Gudem Mahipal Reddy) స్వామి వారి కృపతో పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. ఇప్పటికే రాజగోపురాలు పూర్తి చేయడం జరిగిందని.. సాలహారం పనులు త్వరలో పూర్తికానున్నయని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 11 రోజులపాటు వార్షిక  బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు