ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర షురూ
ఖైరతాబాద్‌లో భారీ సందడి!
హైదరాబాద్: నగరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర(Khairatabad Ganesh Shobha Yatra 2026) ప్రారంభమైంది. భారీ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించే ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. అయితే శోభాయాత్ర ప్రారంభంలో కొంత ఆలస్యం చోటుచేసుకుంది. మహాగణపతిని తరలించేందుకు ఉపయోగించిన క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏర్పాట్లకు ఆటంకం ఏర్పడింది.
సమస్యను పరిష్కరించిన అనంతరం విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపైకి తరలించి శోభాయాత్రను(Khairatabad Ganesh Procession) ప్రారంభించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ట్యాంక్‌బండ్ వైపు సాగనుంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి 20 వేల మందికి పైగా పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు.