బ్యాండ్ శబ్ధానికి ఆగిన యువకుడి గుండె
25-09-2026 | 10:00am
కోరుట్ల/జగిత్యాల, సెప్టెంబర్25(విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలోని తులసి నగర్ లో గురువారం రాత్రి వినాయక నిమజ్జన(Ganesh Nimajjanam) శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. డాన్స్ చేస్తున్న ఓ యువకుడు బ్యాండ్ శబ్దం వల్ల గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం తులసి నగర్ కు చెందిన తోపారపు జయంత్(24) వినాయక నిమజ్జనంలో భాగంగా తన ఇంటి ముందు వీధిలో మిత్రులతో కలిసి బ్యాన్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది యువకుడికి సిపిఆర్ చేశారు.108 అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో పోలీసు వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.