గణేష్ గడ్డ గణనాథుడి మొదటి లడ్డు వేలంపాట
- నాలుగు లక్షల 30
- వేల రూపాయలకు కైవసం చేసుకున్న
- ఎర్రమల్లి ప్రత్యూష వరుణ్ కుమార్
పటాన్ చెరు, సెప్టెంబర్ 25 : సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్(Isnapur Municipality) పరిధిలోని రుద్రారం లో స్వయంభుగా వెలసిన గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో(Sri Siddhi Ganapathi Temple) వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం సాయంత్రం దేవాలయంలో నిర్వహించిన స్వామివారి పల్లకి సేవ, రథయాత్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణేష్ గడ్డ గణనాధుడి లడ్డు వేలంపాటలో మొదటి లడ్డును రామచంద్రపురం పట్టణానికి చెందిన వరుణ్ కుమార్ నాలుగు లక్షల 30 వేల రూపాయలకు వేలంపాటలో లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
అనంతరం ఆలయ ఈవో లావణ్యమాట్లాడుతూ...దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. ఇప్పటికే రాజగోపురాలు పూర్తి చేయడం జరిగిందని.. సాలహారం పనులు త్వరలో పూర్తికానున్నయని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 11 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి అమె కృతజ్ఞతలు తెలిపారు.