బాలాపూర్ లడ్డూ రికార్డు!
హైదరాబాద్: బాలాపూర్ గణేశుడి లడ్డూ(Balapur Ganesh Laddu Record) వేలం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి వేలంలో లడ్డూ ధర ఏకంగా రూ.39(Balapur Ganesh Laddu Auction 2026) లక్షలకు చేరుకోవడంతో కొత్త రికార్డు నమోదైంది. గతేడాది రూ.35 లక్షలు పలికిన లడ్డూ.. ఈసారి మరో రూ.4 లక్షలు అదనంగా పలికి సంచలనం సృష్టించింది. వేలంలో సామా ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు(Balapur Laddu 39 Lakhs) బాలాపూర్ గణేశుడి లడ్డూను దక్కించుకున్నారు. వేలం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఎంతవరకు వెళ్తుందన్న ఆసక్తి నెలకొనగా.. చివరకు గతేడాది రికార్డును బద్దలు కొడుతూ భారీ ధర వద్ద వేలం ముగిసింది. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భక్తి, సంప్రదాయం, వేలం ఉత్కంఠ కలిసిన ఈ కార్యక్రమంలో ఈసారి కూడా రికార్డు ధరే హైలైట్గా మారింది.
బాలాపూర్ గణేశ్ లడ్డూ- స్పెషల్ స్టోరీ
బాలాపూర్ గణేశుడి లడ్డూ అంటే కేవలం ఓ ప్రసాదం కాదు.. హైదరాబాద్లో ఏటా ఆసక్తి రేపే ఓ ప్రత్యేక సంప్రదాయం. మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం.. ఏటేటా పెరుగుతూ లక్షల రూపాయల స్థాయికి చేరుకుంది. భక్తుల విశ్వాసం, వేలంలో ఉండే ఉత్కంఠ, భారీ ధరలే ఈ లడ్డూను ప్రత్యేకంగా నిలబెట్టాయి. గతేడాది రూ.35 లక్షలకు చేరిన వేలం.. ఈసారి ఏ రికార్డు సృష్టిస్తుందోనన్న ఆసక్తి మొదటి నుంచే నెలకొంది.