గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాల(Ganesh Immersion Viral) సందడి తారాస్థాయికి చేరింది. భక్తుల జైజైకారాలు, శోభాయాత్రల మధ్య ఖైరతాబాద్ మహాగణపతి హుస్సేన్‌సాగర్‌లో(NTR Marg Ganesh Immersion) గంగమ్మ ఒడికి చేరాడు. భారీ విగ్రహం తరలివెళ్లే క్రమంలో NTR మార్గ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మహాగణపతి శోభాయాత్ర(Khairatabad Ganesh Visarjan) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీగా తరలివచ్చిన భక్తులు గణపతి నామస్మరణతో పరిసరాలను మార్మోగించారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న నిమజ్జనాల మధ్య ఖైరతాబాద్ బడా గణేశుడి వీడ్కోలు ఘట్టం ప్రధాన ఆకర్షణగా మారింది.
హైదరాబాద్‌లో గణేశ్ జాతర.. ట్యాంక్‌బండ్ దద్దరిల్లింది!
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాల సందడి పీక్స్‌కు చేరింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్ వైపు తరలివస్తున్నారు. MJ మార్కెట్ పరిసరాల్లో వినాయక విగ్రహాలతో శోభాయాత్రలు జోరందుకున్నాయి. జే సౌండ్స్‌తో తరలివస్తున్న గణేశ్ విగ్రహాలు.. భక్తుల తీన్మార్ డ్యాన్స్‌లు.. జైజైకారాలతో నగరం మార్మోగుతోంది. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దే సమయంలో ట్యాంక్‌బండ్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు కూడా డ్యాన్స్ చేస్తూ సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పోలీసుల స్టెప్పులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.