ఎం ఎస్ ఎఫ్ జాతీయ మహాసభ ను జయప్రదం చేయండి

25-09-2026 | 09:52pm

ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర ఇంచార్జీ సందే కార్తీక్ మాదిగ....

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 25  (విజయక్రాంతి): అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) నిర్వహించనున్న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను(Madiga Students' National Conference) విజయవంతం చేయాలనే లక్ష్యంతో శుక్రవారం యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంఎస్ఎఫ్  కమిటీ ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం ఎస్ ఎఫ్   రాష్ట్ర ఇంచార్జీ సందె కార్తీక్ మాదిగ, జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని, విద్యార్థుల హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం ఎం ఎస్ ఎఫ్  లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా దళితుల హక్కులు, సామాజిక న్యాయం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  మూడు దశాబ్దాలుగా కొనసాగించిన పోరాటం, సాధించిన విజయాలను విద్యార్థులకు వివరించారు. అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎం ఎస్ ఎఫ్  నూతన  విద్యార్థి కమిటీ అధ్యక్షులు దర్శనం ధనుష్, ఉపాధ్యక్షులు దుబ్బాక భానుప్రసాద్, ప్రధాన కార్యదర్శి శనివారం గౌతమ్, కమిటీ సభ్యులు నీరటి శ్రీ వాది మాదిగ,ఉపాధ్యక్షురాలు కంది అనూష, సహాయ కార్యదర్శి ఎర్ర నవ్యశ్రీ, సంయుక్త కార్యదర్శి దత్తపు చైతన్య, కమిటీ సభ్యురాలు బిచ్చగారి దీపిక,ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు  మాజీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ, మండల ఇంఛార్జ్ చుంచు ప్రేమ్ మాదిగ, మండల అధ్యక్షులు బీబీనగర్ లక్ష్మణ్ మాదిగ, జీవన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు