కాంగ్రెస్ లో చేరాలనీ బెదిరింపులు

25-09-2026 | 10:06pm

బీఆర్ ఎస్ కౌన్సిలర్ కృష్ణవేణి 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కౌన్సిలర్లకు(BRS Councilors) కాంగ్రెస్ లో చేరాలని మునిసిపల్ చైర్ పర్సన్ భర్త దావా రమేశ్(Dava Ramesh) బెదిరింపులకు పాల్పడుతున్నారని బీ ఆర్ఎస్ 6 వ వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి(Krishnaveni) (రజిత) ఆరోపించారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం(Bellampalli Municipal Office) వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణవేణి బీ ఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి ఆమెను కాంగ్రెస్‌ పార్టీలో(Congress Party) చేరాలని గత ఆరు నెలలుగా మున్సిపల్  చైర్ పర్సన్ స్వాతి,ఆమెభర్త దావ రమేష్ ఒత్తిడి తెస్తున్నారనీ తెలిపారు.

కాంగ్రెస్‌లో చేరే ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ వినిపించుకోవడంలేదన్నారు. కౌన్సిల్‌ సమావేశాల నేపథ్యంలో అధికారులతో బెదిరింపు కాల్ చేపించడం,  బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కలసి నిరసనలు చేయవద్దనీ ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. అలా చేస్తే వార్డులో ఏలాంటి అభివృద్ధి చేయనని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా 7వ వార్డు నుండి కొందరితో తరచుగా బెదిరించడం కూడా చేస్తున్నాడని తెలిపారు. గత ఆరు నెలలుగా ఆరో వార్డులో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనీ తెలిపారు.

దావ రమేష్ కక్షపూరితంగా వ్యవ హరిస్తున్నారని తెలిపారు. మానసికంగా హింసిస్తూ ఇబ్బంది పెడుతూ నానా రకాలుగా భయపెడుతున్నారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వార్డు పనుల నిమిత్తం మున్సిపల్ కమిషనర్, అధికారులకు కాల్ చేసినా నేరుగా కలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు  కనీసం తన కాల్  కూడా లిఫ్ట్ చేయకుండా నన్ను అవమానానికి గురిచేస్తున్నారని వాపోయారు. ఈ వేధింపుల వెనక కాంగ్రెస్ నాయకుడు దావా రమేశ్ ఉన్నాడని తెలిపారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనీ మండిపడ్డారు.

గత ఆగస్టు లో తన వార్డులో  బొడ్డు లలిత ను ఆర్పిగా అందరి సమక్షంలో కొత్తగా ఎన్నికవ్వడం జరిగిందినీ తెలిపారు. ఈ ఎన్నిక చేల్లదంటూ చైర్ పర్సన్ స్వాతి, భర్త రమేష్ ఆర్పి మీద కూడా కక్షకట్టారని తెలిపారు. చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, మెప్మా అధికారులు, కొందరు ఆర్పీలు ఉద్దేశపూర్వకంగానే ఆమెను కూడా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూన్నారని  ఆరోపించారు. ఆర్పీ నీ మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని  తెలిపారు.

ఆరో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే ఆర్పినీ తీసివేస్తానని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని తెలిపారు. తన పంతం నెగ్గించుకోవడానికి దావా రమేశ్ కొంతమందితో తనకు బెదిరింపు సమాచారం పంపించాడనీ తెలిపారు. తనమాట వినే వరకూ ఇబ్బందులు పెడతానని ఎవరికీ  చెప్పుకున్న ఏమీకాదని రమేశ్ బెదిరింపుల తీరును ఆమె వివరించారు. ఆర్పీని తీసివేయాలని నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందనీ తెలిపారు. నోటీసులో పేర్కొన్న  ఆరోపణలన్నీ అబద్ధాలనీ ఆమె ఖండించారు.

అందుకు  మా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయనీ తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, ఆమె భర్త దావ రమేష్  కాంగ్రెస్ పార్టీలో చేరాలని చేస్తున్న బెదిరింపులతో ఆందోళన  చెందుతున్నామని ఆమె వాపోయారు. ఈ సమావేశంలో బీఆర్ ఎస్ టౌన్ అధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు బత్తుల కృష్ణవేణి, తాండ్ర స్రవంతి, సిమ్రాన్, తిరుమల వాసు, రాజకుమార్, కంపెల్లి రాజం, కీటకమల ప్రసన్న, బేడ్డల సౌజన్య, బిఆర్ఎస్ నాయకులు సుందర్రావు, మదర్ తెరిసా ఎస్ఎల్ఎఫ్ కోబీలు, సంతోషం మల్లేశ్వరి, శైలజ, ప్రసన్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు