గణనాథుడికి ఘన వీడ్కోలు
25-09-2026 | 10:17pm
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్(Karimnagar Police Commissionerate) కేంద్రంలో గణేష్ నవరాత్రుల(Ganesh Navratri) సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని(Ganesha immersion ceremony) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Goush Alam) ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల నడుమ గణనాథుడిని నిమజ్జనానికి భక్తిశ్రద్ధలతో సాగనంపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు కమిషనరేట్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.