అత్యవసర సమయంలో రక్తదానం చేసిన

25-09-2026 | 10:03pm

 ఏత్తోండ రాజేందర్

బోధన్, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని(Bodhan town) బీటీ నగర్‌కు చెందిన డెలివరీ పేషెంట్ ఉప్పాల సవితకు(Uppala Savitha) బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో(Bodhan Government Hospital) అత్యవసరంగా రక్తం అవసరమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు చరవాణి ద్వారా నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత(Nizamabad Parliamentary Constituency Telugu Yuvatha) బోధన్ ఇంచార్జ్ ఏత్తోండ రాజేందర్‌ను(Etthonda Rajender) సంప్రదించి రక్తం అవసరమని కోరారు.

వెంటనే స్పందించిన ఏత్తోండ రాజేందర్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని సవితకు రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేయడంతో సవిత కుటుంబ సభ్యులు రాజేందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు