3 September, 2026 | 6:19 PM

ప్రజా పాలన 1000 రోజులు సంబరాలు

03-09-2026 | 05:22pm

పటాన్‌చెరు: సిఎం రేవంత్‌రెడ్డి  నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమీన్‌పూర్‌లో(ameenpur) కాంగ్రెస్‌ నాయకులు గురువారం ఉదయం సంబరాలు నిర్వహించారు. అమీన్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అమీన్‌పూర్‌, బీరంగూడ డివిజన్లకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. అంబేద్కర్(Ambedkar) విగ్రహానికి పూలమాల వేసి, స్వీట్లు పంపిణీ చేశారు.

సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌(Free electricity), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు.

సిఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శశిధర్ రెడ్డి, సుధాకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.