16 August, 2026 | 10:17 PM

Districts - Yadadri Bhuvanagiri

article_17384237.webp
యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆలేరు, ఆగస్ట్ 15 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులకు నివాళులర్పిస్తూ, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

15-08-2026

article_54531246.webp
ఆలేరులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఆలేరు, ఆగస్ట్ 15 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, పి.ఎస్.ఎస్., మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

15-08-2026

article_90764350.webp
త్రివర్ణ పతాక ర్యాలీ కార్యక్రమం

చౌటుప్పల్, ఆగస్టు 14(విజయక్రాంతి): చౌటుప్పల్ బస్టాండ్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు మరియు వివిధ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ హాజరై విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి, జాతీయ సమైక్యత మరియు ఐక్యతా భావాన్ని పెంపొందించేలా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ర్యాలీని ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది.

14-08-2026