స్థానికులకే వక్ఫ్ దుకాణాలు కేటాయించాలి
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మించే దుకాణాలను స్థానికులకే కేటాయించాలని కోరుతూ ముస్లిం మైనార్టీ యువకులు గురువారం ముస్లిం అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు జనాబ్ షేక్ మక్సూద్‌కు వినతిపత్రం అందజేశారు. వక్ఫ్ కాంప్లెక్స్ వెనుక ఎక్స్‌టెన్షన్లకు అనుమతులు ఇవ్వవద్దని, ఇతర ప్రాంతాల వారికి దుకాణాలు కేటాయించకుండా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కమిటీ కార్యాలయాన్ని తరలించవద్దని, ప్రతిపాదిత యు-టైప్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. నాగనూలు రోడ్డులోని కాంప్లెక్స్ కోసం పదేళ్ల క్రితం డిపాజిట్ చేసిన వారికి వెంటనే దుకాణాలు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మహమ్మద్ నసీర్, హస్సేన్, గౌస్, సాజిద్, నిజాం, అహ్మద్ బాబాజీర్ తదితరులు పాల్గొన్నారు.






