రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం
రాంకీ డంపింగ్ యార్డును తొలగించే లక్ష్యంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ, దమ్మాయిగూడ జేఏసీ ఉమ్మడి కార్యాచరణకు అంగీకరించాయి. జవహర్‌నగర్‌లో జరిగిన అత్యవసర సమావేశంలో చైర్మన్ షేక్షావలి, కన్వీనర్ డాక్టర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు వాయు, నీటి కాలుష్యంతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
30-06-2026