15 August, 2026 | 12:51 PM

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 12:13 PM

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్, ఆగష్టు 15(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా గండిమైసమ్మలోని 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ ఐక్యత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలని, భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.