16 August, 2026 | 10:16 PM

ఓకే ప్లాటును వేరువేరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్... మాజీ సొసైటీ అధ్యక్షుడిపై కేసు

16-08-2026 09:03 PM

బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన మేడిపల్లి పోలీసులు

మేడిపల్లి, ఆగస్టు 16 (విజయక్రాంతి): ఒకే ప్లాటును పలుమార్లు వేర్వేరు వ్యక్తుల పేరిట రిజిస్టర్ చేయించి మోసానికి పాల్పడిన ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన గైనీ కాలాధర్(44) పర్వతాపూర్ రెవెన్యూ సలార్‌జంగ్ కంచలో గల ప్లాట్ నెం. ఇ/173ను కాలాధర్ 2013లో డాక్యుమెంట్ నెం. 4744/2013 ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని కొనుగోలు చేశారు.

అయితే ఈ ప్లాటు గతంలోనే పలుమార్లు చేతులు మారి, చివరకు శ్రీ రమణ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మొదలైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ సొసైటీ 1982లోనే తన సభ్యురాలు సుమతి పేరిట ఈ ప్లాటును తొలిసారి రిజిస్టర్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

2001లో సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కారెడ్ల మాల్లారెడ్డికి ఈ ప్లాట్లు గతంలోనే రిజిస్టర్ అయిన విషయం తెలిసినప్పటికీ, ప్లాట్ నెం. ఇ/173తో సహా ఇతర ప్లాట్లను కూడా వేర్వేరు వ్యక్తుల పేరిట ఫిర్యాదుదారు కాలాధర్ పేరిట సైతం మరోసారి రిజిస్టర్ చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నిజమైన కొనుగోలుదారులు మోసపోయానని  ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని సీఐ డీ.జలంధర్ రెడ్డి తెలిపారు.