14 August, 2026 | 10:12 PM

డంపింగ్ యార్డును యుద్ధ ప్రాతిపదకన ఎత్తివేయాలి

14-08-2026 09:03 PM

పర్యావరణ విషతుల్యం ప్రజల ఆరోగ్యం గాల్లో దీపమేనా?

డంపింగ్ ప్రాంతంలోని మరణాలన్నీ రాంకీ పాపమే

డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి

జవహర్ నగర్,(విజయక్రాంతి): డంపింగ్ దుర్వాసనతో పర్యావరణం విష తుల్యమవుతూ ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారుతుందని వెంటనే డంపింగ్ యార్డును శాస్త్రీయ పద్ధతిలో యుద్ధ ప్రాతిపదకన ఎత్తివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పవని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమా మహేష్ డిమాండ్ చేశారు. చెత్త రామ్కి డంపింగ్ యార్డ్ ను శాస్త్రీయ పద్ధతిలో శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమామహేశుల ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్ నగర్ మాజీ ప్రజా ప్రతినిధుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా షేక్షావలి  మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ప్రభావిత ప్రాంతంలో రాంకీ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘనలతో మరణించిన మరణాలన్నీ అసహజమైన వేనని నష్టపరిహారం చెల్లించాలన్నారు.  డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ దీనికి వెన్నంటి ఉంటుందని తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధుల మద్దతు తెలిపారు. ప్రతి డివిజన్లో కమిటీలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు శాంతి కోటేష్ గౌడ్, శ్రీనివాస్, లలిత యాదవ్ ,సంగీత రాజశేఖర్ ,వేణు, రవి, బాబు, శ్రీనివాస్, వెంకటేష్, సాయి, నవీన్ శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం రాజకుమార్ రాంచందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.