19 May, 2026 | 11:02 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

విద్యార్థి మృతిపై జోనల్ ఆఫీసర్ విచారణ

09-12-2025 12:00 AM

ఉపాధ్యాయులపై చర్యలు

నిజాంసాగర్, డిసెంబర్8 (విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి  ఆదివారం నాడు గొట్టం అజయ్ అనే విద్యార్థి మంజీరా నదిలో నీట మునిగి మరణించిన సంఘటనపై సాంఘిక సంక్షేమ జోనల్ అధికారి ప్రత్యూష సోమవారం నాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అచ్చంపేట నందు విచారణ నిర్వహించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన గణపతికి ఏడు రోజుల్లోగా సంజాయిషీవ్వాలని నోటీసు జారీ చేశారు.

నిర్లక్ష్యం గా వ్యవహరించిన ఉపాధ్యాయుడు రవికాంత్ ను విధుల్లో నుంచి తొలగించినట్లు ఆమె తెలిపారు. విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా ఉన్న తాత్కాలిక ఉపాధ్యాయులు లక్ష్మయ్య, పీఈటి రాజు, వాచ్మెన్ కిషన్లపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట డిసీవశివరావు ఉన్నారు.