9 May, 2026 | 12:42 PM

Breaking News

ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి   •   వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలి   •   వేసవి క్రీడా శిక్షణ ముగింపు   •  

ఒమన్‌ను చిత్తు చేసిన జింబాబ్వే

10-02-2026 02:08 AM

కొలంబో, ఫిబ్రవరి 9 : ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్‌లో జింబాబ్వే శుభారంభం చేసిం ది, గ్రూప్ బిలో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించి 8 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది. జింబాబ్వేకు ఏ దశలోనూ ఒమన్ పోటీనివ్వలేకపోయిం ది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒక దశలో కీలక బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో కేవలం 27 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వినాయక శుక్లా (28), సుఫ్యాన్ మొహమూద్(25), నమీద్ ఖాన్(20) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

వీరి పోరాటం కారణంగానే కనీ సం 100 పరుగులైనా దాటగలిగింది. జిం బాబ్వే బౌలర్లలో నగరవ(3/17) , ముజరబని(3/16), బ్రాడ్ ఎవాన్స్(3/18) మూడేసి వికెట్లు తీయగా.. సికిందర్ రాజా(1/17) ఒక వికెట్ పడగొట్టారు. ఛేజింగ్‌లో జింబాబ్వే ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. బ్రి యాన్ బెన్నెట్( 36 బంతుల్లో 7 ఫోర్లతో 48 నాటౌట్), మారుమణి (11 బంతుల్లోనే 5 ఫోర్లతో 21) రన్స్ చేసారు.

డియో మేయర్స్ డకౌటైనా.. బ్రెండన్ టేలర్(31), కెప్టెన్ సికిందర్ రాజా(5) విజయాన్ని పూర్తి చేశారు. జిం బాబ్వే 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఒమన్ బౌలర్లలో మొహమూద్ 2 వికెట్లు పడగొట్టాడు. జిం బాబ్వే తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో , ఒమన్ శ్రీలంకతో ఆడనుంది.