9 May, 2026 | 1:42 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

జెమీమాకు ప్రమోషన్

10-02-2026 02:07 AM

వరల్డ్‌కప్ స్టార్లకు జాక్‌బాట్

ముంబై, ఫిబ్రవరి 9 : మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యత పెంచుతూ వెళుతున్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ టాలెంటెడ్ ప్లేయర్స్‌కు పెద్దపీట వేసింది. గత ఏడా ది వన్డే ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన పలువురు క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్‌లో జాక్ పాట్ కొట్టారు.  వర ల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ బాదిన జెమీమా రోడ్రిగ్స్‌కు ప్రమోషన్ ల భించింది. తాజా జాబితాలో జెమీమా గ్రేడ్ ఏలో చోటు దక్కించుకుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్, స్మృతి, దీప్తితో పాటు ఇప్పుడు జెమీ మా కూడా గ్రేడ్ ఏలోకి ఎంటరైంది.

అటు వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన రాధా, అమన్ జోత్, అరుంధతి రెడ్డి, ప్రతీకా రావ ల్, క్రాంతి గౌడ్, ఉమా ఛెత్రీ గ్రేడ్ బిలోకి ప్ర మోట్ అయ్యారు. అలాగే తెలుగుతేజం శ్రీచరణి, హార్లిన్ డియోల్, ఇటీవలే అరంగేట్రం చేసిన వైష్ణవి శర్మ, జి కమిలిని కూడా గ్రేడ్ సి లో చోటు దక్కించుకున్నారు. అయితే శ్రే యాంకా, పూజా వస్త్రాకర్‌కు మాత్రం చోటు దక్కలేదు. కాగా  గ్రేడ్ ఏకు రూ.50 లక్షలు, గ్రేడ్ బికి రూ.30 లక్షలు, గ్రేడ్ సికి రూ.10 లక్షలు వార్షిక పారితోషకంగా చెల్లిస్తోంది. 

గ్రేడ్ A 

హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్

గ్రేడ్ B 

రేణుక ఠాకూర్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, ప్రతికా రావల్, క్రాంతి గాడ్, ఉమా చెరీ, అరుంధతి రెడ్డి

గ్రేడ్ C 

శ్రీ చరణి, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, జి కమలిని, వైష్ణవి శర్మ తేజల్ హసబినీస్