30 May, 2026 | 11:27 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

మూడు నెలలే బతుకుతానన్నారు

10-04-2026 01:04 AM

క్యాన్సర్ దశను గుర్తు చేసుకున్న యువరాజ్ సింగ్

ముంబై, ఏప్రిల్ 9: భారత క్రికెట్‌లో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ క్యాన్సర్‌ను జయించిన తీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలోనే యు వీ క్యాన్సర్‌తో బాధపడ్డాడు. ఆ బాధను ఓర్చుకుంటూనే ప్రపంచకప్‌లో అదిరిపోయే ప్రదర్శనలు చేశాడు.

తర్వాత చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడిన యువరాజ్ తాజాగా ఒక ఇంటర్యూలో అప్పటి క్లిష్టమైన పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు విదేశీ పర్యటనకు సిద్ధమైనప్పుడు తనకు క్యాన్సర్ ఉందనే విష యం తెలిసిందన్నాడు. అప్పుడు కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నాననీ, టెస్టులకు గంగూలీ రిటైర్మెంట్ ఇవ్వడంతో తనకు అవకాశం వ చ్చిందన్నాడు. అయితే క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత డాక్టర్లు తాను కేవలం 3 నెలలే బతుకుతానని చెప్పారని గుర్తు చేసుకున్నాడు.

క్రమంగా తన ఆరోగ్యం మరింత క్షీణించినప్పుడు అమెరికా మాజీ సైక్లిస్ట్ ఆర్మ్‌స్ట్రాం గ్‌కు చికిత్స చేసిన డాక్టర్‌ను కలిసానని, ఆయన తనకు భరోసా ఇచ్చారన్నాడు. క్యా న్సర్‌తో చనిపోతాననే మాట కంటే టెస్ట్ క్రికె ట్ ఆడలేనేమోనన్న ఆలోచనే చాలా బాధపెట్టిందన్నాడు. కీమోథెరపీ చేయించుకుంటు న్నప్పుడు క్రికెట్ వీడియోలు చూసేవాడనని, సచిన్, కుంబ్లే వచ్చి చూసి ధైర్యం చెప్పేవారని యువీ వెల్లడించాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత ఫిట్‌నెస్‌పై రెండు నెలల పాటు దృష్టి పెట్టానని, ఆ తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన క్షణం ఎప్పటికీ ప్రత్యేకమేనని యువరాజ్ చెప్పుకొచ్చాడు. క్యాన్సర్ ను జయించిన యువీ తన పేరిట ఫౌండేషన్ స్థాపించి సంబంధిత బాధితులకు అండగా నిలుస్తున్నాడు.