10 April, 2026 | 3:00 AM

టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటా

10-04-2026 01:06 AM

రషీద్‌ఖాన్ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్టు సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్‌ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పార నీ, అయినా గత ఏడాది జింబాబ్వేపై ఓ టె స్టులో 67 ఓవర్లు వేశాననీ గుర్తు చేసుకున్నాడు. అది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు.

ఈ విషయం తెలిసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారన్నాడు. ఇకపై టెస్ట్ క్రికెట్ ఆడే సాహసం చేస్తే, ఎక్కువ కాలం కొనసాగలేనని హెచ్చరించినట్లు వెల్లడించాడు. రషీద్ ఖాన్ 2023 నుంచి వెన్ను గాయాల తో ఇబ్బందులు పడుతున్నాడు. కీలకమైన సర్జరీ కూడా చేయించుకున్నాడు. వైద్యులు రెడ్‌బాల్ క్రికెట్ ఆడొద్దని స్పష్టంగా సూచించారు. రషీద్‌ఖాన్ టెస్ట్ కెరీర్ చూస్తే ఆఫ్ఘని స్తాన్ 2017లో టెస్ట్ హోదా పొందినప్పటి నుంచి 12 మ్యాచ్‌లు ఆడగా,  6 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు తీశాడు.