15 June, 2026 | 3:21 PM

Breaking News

ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •  

వాగులో గల్లంతైన వ్యక్తిని కాపాడిన యువకులు

30-10-2025 12:36 AM

తాండూరు, 29 అక్టోబర్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నానది వాగులో ఓ వ్యక్తి  గల్లంతైన విషయాన్ని గమనించిన గ్రామస్తులు చాకచక్యంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి తాళ్ల సాయంతో వ్యక్తిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు .తాండూరు మండలంలోని వీర్ శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగ్నానదిలో కొట్టుకుంటూ వచ్చాడు.

వీర్ శెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద చేతులెత్తి.. మునుగుతూ.. తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. వర్షపు నీరు ఉధృతికి దూరం పెరుగుతుండడంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి వాగులోకి తాడు విసిరి.. నర్సయ్యను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108కు సమాచారం అందించి తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.గ్రామ యువకులు చేసిన సాహసానికి గ్రామస్తులు అభినందించారు.