ఈతకు వెళ్లి యువకులు మృతి
16-05-2026 12:00 AM
చేగుంట, మే 15 : మాసాయిపేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మాసాయిపేట పట్టణానికి చెందిన నాగోల్ల భాను (16 ) జాల నందకిషోర్ (17) శుక్రవారం ఉదయము 9 గంటల కు రామంతాపూర్ గ్రామ శివారులోని క్వారీలో గల నీటిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినారు, ఇట్టి విషయములో నాగోల్లా స్వామి తండ్రి బాలయ్య పిర్యాదు మేరకు చేగుంట ఎస్ ఐ, చైతన్య కుమార్ రెడ్డి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






