24 August, 2026 | 11:34 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూమి హక్కు పత్రాలు అందజేత

16-05-2026 12:00 AM

కోహెడ, మే 15: కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో నిర్మిస్తున్న హుస్నాబాద్ నియో జకవర్గస్థాయి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రభుత్వ స్థలం యొక్క భూమి హక్కు పత్రాలను తహసీల్దార్ నవీన్ కుమార్ జిల్లా విధ్యాధికారి శ్రీనివాస్ రెడ్డి కి అందిం చారు. ఈ సందర్బంగా జిల్లా విద్యాధికారి శ్రీ ఇ.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల నిర్మాణం వేగంగా జరుగుతుందని, ఈ పాఠశాల 2027-28 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందు బాటులోకి వస్తుందన్నారు.

పాఠశాల నిర్మాణానికి గ్రామస్తులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. రెవిన్యూ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు.  తహసిల్దార్ నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ బోయిని సంపత్, గిరిధావన్ ఎల్లయ్య, సెక్టోరల్ అధికారి రామస్వామి, గ్రామస్తులు బండిపెల్లి నారాయణ, పాము శ్రీకాంత్, పిల్లి రాజు, అబ్దుల్ రఫీ, పిల్లి సత్యనారాయణ, జిపిఓ వనిత, సిఆర్పి రాజేశం, పాల్గొన్నారు.