16-02-2026 09:21:58 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): క్రీడలతోనే యువతకు గర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ జిల్లా యువ నాయకులు పల్లె విజయ్ గౌడ్ ఉన్నారు. ఘట్ కేసర్ పట్టణంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహా వార్షికోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు సామల సందీప్ రెడ్డి సహకారంతో చైతన్య యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ సీజన్ - 3 పోటీలు ఘనంగా జరిగాయి.
యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ టొర్నమెంట్ లో మొత్తం 24 జట్లు పాల్గొనగా అల్వాల్ ఏ జట్టు విజేతగా నిలువగా బీ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు విజయ్ గౌడ్ చేతుల మీదుగా నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు, క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.