26 July, 2026 | 1:54 AM

ముగిసిన యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు

26-07-2026 12:46 AM

సత్తాచాటిన సికింద్రాబాద్ క్లబ్ సెయిలర్లు 

హైదరాబాద్, జూలై 25: జీఎంఆర్ స్పోర్ట్స్ 6వ వైఏఐ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు హుస్సేన్ సాగర్‌లో ఘనంగా ముగిసాయి. ఆరు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో దేశ, విదేశాలకు చెందిన 115 మంది సెయిలర్లు పాల్గొన్నారు. సికింద్రాబాద్ క్లబ్‌కు చెందిన యువ సెయిలర్ శృంగేరి రాయ్ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.

ఆప్టిమిస్ట్ మెయిన్ బాలికల టైటిల్‌ను కైవసం చేసుకుంది. 420 బాలికల విభాగంలోనూ సికింద్రాబాద్ క్లబ్ సెయిలర్లు సత్తా చాటారు. ఇషి గుప్తా, దియా అజయ్ పటేల్ ఈ కేటిగిరీలో అగ్రస్థానం సాధిం చి స్వర్ణపతకం గెలుచుకున్నారు. ఆప్టిమిస్ట్ మెయిన్ బాలుర విభాగంలో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధిపత్యం కనబరిచింది. బి.రవికుమార్ ఈ విభాగంలో అగ్ర స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

ఆప్టిమిస్ట్ గ్రీన్ బాలుర విభాగంలో యు వరాజ్ సిరోహి, బాలికల విభాగంలో నేతికొపుల సింధు, ఐఎల్ సీఏ 4 బాలుర విభాగంలో అంకిత్ సింగ్ సిసోడియా, బాలికల విభాగంలో తుల్సీ పట్లే, ఐఎల్ సీఏ 6 బాలుర విభాగంలో అమర్ జైస్వాల్, బాలికల విఙాగంలో శీతర్ సెంధవ్, 420 మిక్సిడ్ విభాగంలో బద్రినాథ్ నిరుదు, రిష్విత జోడీ స్వర్ణ పతకాలు సాధించారు. 29 ఇఆర్ విభాగంలో ఆకాశ్ తంగయ్, కృష్ణ దివాకర్ జోడీ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక ఆప్టిమిస్ట్ టీమ్ విభాగంలో త్రిష్ణ సెయిలింగ్ క్లబ్ విజేతగా నిలిచింది. యువ సెయిలర్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగడం సంతోషంగా ఉందని, వాటర్ స్పోర్ట్స్‌లో తెలంగాణ నుం చి మరింత మంది ఛాంపియన్లు రావాలని సికింద్రాబాద్ క్లబ్ కమాడోర్ అర్జున్ చెప్పారు.