దక్షిణాఫ్రికా స్విమ్మర్ సరికొత్త చరిత్ర
అత్యధిక పతకాలు గెలిచిన చాడ్ లె క్లోస్
గ్లాస్గో, జూలై 25: దక్షిణాఫ్రికా స్టార్ స్విమ్మర్ చాడ్ లె క్లోస్ కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల 4x100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకం గెలిచాడు. తద్వారా ఈ గేమ్స్‌లో అ త్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా నిలిచాడు. ఈ కాంస్యంతో అతడి ఖా తాలో మొత్తం 19 కామన్వెల్త్ పతకాలు చేరా యి. దీంతో 18 పతకాలతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా షూటర్ ఫిల్ ఆడమ్స్, ఇం గ్లాండ్ షూటర్ మిక్ గాల్ట్ల రికార్డును అధిగమించాడు.
ఇప్పటి వరకు లె క్లోస్ ఏడు స్ర్ణాలు, నాలుగు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో మొత్తం 19 పతకాలు సాధించాడు. ఈ విజయం తనకు చాలా విలువైనదని చెప్పాడు. క్లోస్ పతకాల వేట ఇంకా ముగియలేదు. అతడు 50 మీటర్లు, 100 మీటర్ల బటర్ఫ్లై విభాగాల్లో కూడా పోటీపడనున్నాడు. దీంతో పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 16 టైటిళ్లు సాధించాడు.






