ఝండూ కుమార్‌కు కాంస్యం
పారా పవర్‌లిఫ్టింగ్‌లో పతకం
కామన్‌వెల్త్‌గేమ్స్‌లో భారత్ బోణి
స్విమ్మింగ్‌లో నిరాశ
అతని పట్టుదల ముందు వైకల్యం ఓడిపోయింది... దేశానికి పతకం అందించాలన్న లక్ష్యం ముందు పోలియో సైతం చిన్నబోయింది. పేదరికం కూడా అతని లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయింది. రిక్షా తొక్కుతూ ఎన్నో కష్టాలను ఎదిరించాడు. తండ్రి కూరగాయలమ్ముతూ అం దించిన ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాడు. అతనెవరో కాదు బిహార్‌కు చెందిన ఝండూ కుమార్. అద్భుత ప్రదర్శనతో కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు.
గ్లాస్గో, జూలై 25: ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ కొట్టింది. హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఫైనల్లో ఝండూ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 190 కిలోల బరువును ఎత్తిన ఝండూ 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో తొలి ప్రయత్నంలో 181 కిలోల బరువును సునాయాసంగా ఎత్తిన ఝండూ కుమార్, రెండో ప్రయత్నంలో 190 కిలోలను ఎత్తాడు.
ఈ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచేలా కనిపించాడు. అయితే చివరి ప్రయత్నంలో 196 కిలోల బరువును ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమవడంతో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అతను మెడల్ గెలిచిన తర్వాత నెటిజన్లు ఝండూ కుమార్ గురించి ఇంటర్నెట్‌లో తెగ వెతికారు. అంతర్జాతీయ క్రీడావేదికపై భారత జెండాను రెపరెపలాడించిన ఝండూ ప్రయాణం కష్టాలతో నిండింది. పుట్టుకతోనే వైకల్యం సంక్రమించినా, అతని లక్ష్యాలను మాత్రం అడ్డుకోలేకపోయింది.
29 ఏళ్ల ఝండూ.. బిహార్ నలంద జిల్లా హర్నౌత్ గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి కూరగాయలమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నతనంలోనే పోలియో బారిన పడిన ఝండూ క్రీడల మీద ఆసక్తితో షార్ట్‌పుట్, డిస్కస్ త్రో వంటి ఆటలపై దృష్టిపె ట్టాడు. ఆరంభంలోనే రాష్ట్ర స్థాయి పతకాలు గెలుచుకున్నాడు.పారా పవర్‌లిఫ్టింగ్ క్రీడలో మెరుగయ్యేందుకు జిమ్‌లో కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే ఝండూ ఆర్థిక పరిస్థితి కారణంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం సాధ్యపడేది కాదు. దీంతో స్థానిక మార్కెట్లలో కూరగాయలు విక్రయించేవాడు. కొంతకాలానికి స్నేహితుల దగ్గర అప్పు చేసి ఈ కొనుక్కున్నాడు. దాన్ని నడపగా వచ్చిన డబ్బును తన ట్రైనింగ్ కోసం వెచ్చించాడు.
రాష్ట్ర స్థాయిలో మంచి విజయాలు సాధించినా, జాతీయ పోటీల్లో మాత్రం ఆరంభంలో రాణించలేదు. పారాలింపిక్ కాంస్య పతక విజేత రాజిందర్ సింగ్ అతడి ప్రతిభను గుర్తించి గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్ల్ తీసుకెళ్లాడు. ఇక్కడ నుంచి అతని కెరీర్ మలుపు తిరిగింది. 2025లో జరిగిన జాతీ య ఛాంపియన్ షిప్ పోటీల్లో ఏకంగా 205 కిలోల బరువులెత్తిన ఝండూ సరికొత్త జాతీయ రికార్డ్ సాధించాడు. ఆ తర్వాత ఖేలో ఇండియా పారాగేమ్స్లో 206 కిలోలు ఎత్తడం ద్వారా మరో రికార్డు సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు పలు పోటీల్లో పాల్గొని విజయాలను అందుకున్నాడు.






