3 July, 2026 | 7:14 PM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్

03-07-2026 06:18 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని స్వగ్రామం రామేశ్వర్‌పల్లికి వచ్చిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తనయుడు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాస్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో మరింత చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఇద్దరూ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, గ్రామీణ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని బద్దం ఇంద్రకరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.