26 May, 2026 | 3:59 AM

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన

26-05-2026 01:14 AM
  1. ఆటో లాగిన నేతలు.. మోడీ దిష్టిబొమ్మ దహనం
  2. రేట్లు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

కరీంనగర్, మే 25 (విజయ క్రాంతి): రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఇందిరా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి,

మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆటో రిక్షాకు తాడు కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలియజేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్.డి.ఎ నేతృత్వంలోని నరేంద్ర మోడీ సర్కార్ నెల రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులకు మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది నిజంగా సిగ్గుపడవలసిన విషయమన్నారు.

ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఫహద్, అసెంబ్లీ అధ్యక్షులు పంజాల కృపా సాగర్, కార్పొరేషన్ అధ్యక్షులు ఉప్పరి విశాల్, కార్పొరేటర్లు వరాల నరసింగం, పడాల శ్రీజ అజయ్, గుమ్మడి రాజకుమార్, పర్వతం మల్లేశం, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, రజిత రెడ్డి, కుంభాల రాజ్ కుమార్, అబ్దుల్ రెహమాన్, ఆశిష్ గౌడ్, ఆమేర్, పెంట శేఖర్, ఎట్టం వేణు, తదితరులు పాల్గొన్నారు.