పరమేశ్వర్ గౌడ్ కుటుంబానికి చిన్ననాటి స్నేహితుల చేయూత
09-08-2026 03:39 PM
రూ.66, వేల ఆర్థిక సాయం
గణపురం,ఆగస్టు 09 (విజయక్రాంతి): గణపురం మండల కేంద్రానికి చెందిన పల్లె పరమేశ్వర్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా 1994-95 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. చిన్ననాటి స్నేహితులంతా కలిసి ఆదివారం పరమేశ్వర్ కుటుంబానికి రూ. 60 వేల ఆర్థిక సాయాన్ని వారి కుటుంబసభ్యులకుఅందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరమేశ్వర్ గౌడ్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.






