చుక్కాపూర్ సర్పంచ్‌తో పాటు 10 మంది వార్డు సభ్యు లు కాంగ్రెస్‌లో చేరిక
పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన షబ్బీర్ అలీ
కామారెడ్డి, ఆగస్టు 9 ((విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి(Congress party) మరింత బలం చేకూరింది. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు తో పాటు 10 మంది వార్డు సభ్యులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. వార్డు సభ్యులు స్వామి, భవిత, దశరథం, సులోచన, పోషయ్య, భవాని, మహేష్, లక్ష్మి, లక్ష్మి గణేష్, బాబు తదితరులకు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో చుక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నౌసిలాల్ నాయక్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్, ఆనంద్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.






