ఘనంగా యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భిక్కనూర్, ఆగస్టు 9(విజయ క్రాంతి): యూత్ కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భిక్కనూర్ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. పేదలు, రోగులు, ఆపదలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీవన్, కర్నల శ్రీను, చిరంజీవి, ప్రదీప్, శశి, వంశీ, కిషన్, గంగాధర్, షారూక్, చక్రపాణి, సోహెల్, అశోక్, స్వామి, శ్రీకాంత్, లోకేష్, నిఖిల్, ప్రణయ్, అభిషేక్, బాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు






