9 August, 2026 | 4:13 PM

రైతులకు అవగాహన సదస్సు

09-08-2026 03:24 PM

నిర్మల్ ఆగస్టు 8 ( విజయ క్రాంతి): ఎల్‌ నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఏఈఓ రజిని అన్నారు. నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపాడ్, భాగ్యనగర్, రత్నాపూర్ కాండ్లి గ్రామాల్లో ఆదివారం ఎల్‌ నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు కొండా పద్మ శ్రీనివాస్, గంగుబాయి, హరీష్, రైతులు, పాల్గొన్నారు.