విధులకు వెళ్లిన యువకుడు అదృశ్యం
29-04-2026 08:49 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఇంటి నుండి విధులకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ సిపిఐ కాలనీలో యాప్రాల్ ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆనంద్ చిన్న కుమారుడు యాప్రాల్ తరుణ్( 31 )ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 26న విధులకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం పనిచేస్తున్న ఆఫీసులో వాకబు చేసినా బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు తండ్రి ఆనంద్ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






