29 April, 2026 | 10:49 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

పదో తరగతిలో విద్యార్థుల ప్రతిభ

29-04-2026 08:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): స్థానిక నిర్మల్ జిల్లాలోని వాసవి పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 2025- 26 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభను  సాధించారు. మొత్తం 31 1మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 271 మంది విద్యార్థులకు 550 కి పైగా మార్కులు సాధించడం విశేషం. 587 మార్కులు ఇద్దరు,580 కి పైగా 15 మంది విద్యార్థులు, 570కి పైగా 43 మంది విద్యార్థులు, 560 కి పైగా 82 మంది విద్యార్థులు, 550 కి పైగా1 28 విద్యార్థులు  విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.

ఈ ఫలితాలలో వాసవి పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది.ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకుపాఠశాల యాజమాన్యం అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులకు శాలువాతో సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ పోతా రెడ్డి గారు, సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి గారు ,ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శెట్టి, రాజకుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.