ఎన్ఎస్పీ కాలువలో పడి యువకుడు మృతి
14-04-2026 09:44 PM
కూసుమంచి,(విజయక్రాంతి): సరదాకు ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మంగళవారం కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, ఈశ్వరమాదారం గ్రామానికి చెందిన నవీలే నర్సయ్య కుమారుడు నవీలే గణేష్(23) సాయంత్రం సమయంలో ఎన్ఎస్పీ కాలువలో ఈత కొట్టేందుకు ప్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికులు కాలువలోకి దూకి గణేష్ ను బయటకు తీసి బ్రతికించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. సరదా కోసం వెళ్లిన యువకుడు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో రోదన కన్నీటిపర్వంతమైంది.






