30 August, 2026 | 6:34 PM

ఈఎంఐ చెల్లించలేక యువకుడి ఆత్మహత్య

30-08-2026 05:43 PM

అప్పుల భారం.. ఇంటి జప్తుతో మనస్తాపం

బాన్సువాడ, ఆగస్టు 30 (విజయ క్రాంతి): అప్పుల భారం, ఈఎంఐ లు చెల్లించలేక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం బస్వాయిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విఠల్ (28) ఇంటి నిర్మాణం కోసం రెండు ఫైనాన్స్ కంపెనీల్లో రుణం తీసుకున్నట్లు మృతుడి భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

రుణాలకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఈ నెల 22న ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఇంటిని సీజ్ చేసినట్లు తెలిపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విఠల్ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.