30 August, 2026 | 8:37 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాలు

30-08-2026 06:28 PM

భూపాలపల్లి టౌన్,ఆగస్టు 30(విజయ క్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాయని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. తిరుపతి విమర్శించారు. ఆదివారం భూపాలపల్లిలోని కారల్ మార్క్స్ కాలనీ సీపీఎం కార్యాలయంలో డివైఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలులో అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసి, కోల్ మైన్స్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

ఈ మహాసభలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్ నాయక్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ అంబాల స్వర్ణలత, కో-కన్వీనర్ తోట జ్ఞానేశ్వరి, రవికుమార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.