30 August, 2026 | 7:03 PM

జగన్నాధపురంలో ‘గ్రోమోర్’ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ వినోద్

30-08-2026 06:12 PM

ములకలపల్లి,ఆగస్టు 30 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రోమోర్ కేంద్రాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ కుంజా వినోద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రోమోర్ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్నాధపురం గ్రామంలో గ్రోమోర్ కేంద్రం అందుబాటులోకి రావడం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు.

గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు అవసరమైన ఎరువులు,విత్తనాలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుందన్నారు.రైతులు వ్యవసాయ పనుల సమయంలో అవసరమైన సామగ్రి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించడంతో పాటు,పంటల సాగులో అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ గ్రోమోర్ కేంద్రం రైతులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని మెరుగైన దిగుబడులు సాధించాలని సూచించారు.

అనంతరం గ్రోమోర్ నిర్వాహకులు సర్పంచ్ కుంజా వినోద్‌తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కణితి సత్యనారాయణ, రైతులు అడపా నాగేశ్వర రావు,ఎనుగంటి రాము, పిడియాల బుజ్జి,వేముల మురళి,సీతాయిగూడెం మాజీ సర్పంచ్ కారం సుదీర్ ను మర్యాదపూర్వకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్ నేషనల్ మన గ్రోమోర్ యాజమాన్యం తెలంగాణ ఎన్ ఎస్ ఓ  హెడ్.క్రిష్ణయ్య, మార్కెటింగ్ మేనేజర్ బాలకిషన్, ఆర్ ఎ సి లక్ష్మణ్, రైతులు, అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు