ఎంఎస్‌పీ గణపురం మండల అధ్యక్షుడిగా నాగరాజు
గణపురం,ఆగస్టు 30 (విజయ క్రాంతి): మహాజన సోషలిస్టు పార్టీ గణపురం మండల శాఖ అధ్యక్షుడిగా మాస్ నాగరాజు మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాజన రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల తో ఈ ఎన్నిక నిర్వహించారు. మండల ఇన్‌చార్జి నోముల శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి నడిపెల్లి శ్యామ్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాస్ నాగరాజు మాదిగను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీనియర్ నాయకులు బొల్లి బాబు మాదిగ, గాజుల బిక్షపతి మాదిగలకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మండల అధికార ప్రతినిధిగా కుక్కముడి కుమార్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ మాదిగను ఎన్నుకున్నారు.






