మధు కలెక్షన్ గ్రాండ్ ఓపెనింగ్
షోరూమ్‌ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ , ఆగస్టు 30విజయక్రాంతి: డాక్టర్ ఏఎస్ రావు నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “మధు కలెక్షన్” 1 గ్రాము ఇమిటేషన్ జ్యువెలరీ షోరూమ్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన ఆభరణాలను అందుబాటు ధరల్లో అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానికంగా కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
మధు కలెక్షన్‌లో వివిధ రకాల 1 గ్రాము ఇమిటేషన్ జ్యువెలరీ, ఆధునిక ట్రెండీ డిజైన్లు, ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక రాయితీలు, ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు






