30 August, 2026 | 8:22 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

క్రీడలకు కొత్త కెప్టెన్లు

30-08-2026 06:07 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS & GA) కోఆర్డినేటర్‌గా అజ్మీరా కిషోర్, జనరల్ కెప్టెన్‌గా రాపూరి బాబురావు నియమితులయ్యారు. జీఎం వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు శనివారం నియామక కార్యక్రమం నిర్వహించారు. ఇంచార్జ్ ఎస్‌ఓ టు జీఎం, ఏరియా క్వాలిటీ మేనేజర్ కె. రామదాసు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ వైస్‌ప్రెసిడెంట్ జె. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కె. రామదాసు మాట్లాడుతూ.. ఉద్యోగుల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, ఒత్తిడి తగ్గించేందుకు సింగరేణి సంస్థ క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు కంపెనీ అనేక అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇల్లందు ఏరియా క్రీడాకారులు కంపెనీ, కోల్‌ఇండియా స్థాయిలో రాణించి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అజ్మీరా తుకారాం, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి. సుధాకర్, WPS & GA హానరరీ సెక్రటరీ అశోక్, క్లర్క్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.