మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం ఆపన్నహస్తం
బాన్సువాడ, ఆగస్టు 30 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. తన సొంత నిధుల నుంచి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని వెంకన్న కుటుంబానికి ఆదివారం అందజేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాలతో పాటు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజలకు అండగా నిలిచే ఇలాంటి నాయకుడు తమకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.






