యువ ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలి
- ఆ బాధ్యతను పరిశ్రమలు స్వీకరించాలి
- రెండు నెలల్లో రీస్కిల్లింగ్ కార్యక్రమాలు
- ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న రెండు లక్షల మంది ఇంజినీరింగ్ గ్రా డ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యోగాలకు సంసిద్దులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరిం చాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధ ర్ బాబు కోరారు. యూనివర్సిటీ చదువులకు, ఇండస్ట్రీ అవసరాలకు అంతరం పెరిగి నందున ప్రతి సంస్థ తమ బాధ్యతగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
నగరానికి చెందిన పీఎస్‌ఆర్ టెక్ హబ్ సంస్థ పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భం గా సోమవారం బేగంపేటలోని వివాంతా హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. టెక్నాలజీ రంగంలో నిత్యం ఎదురయ్యే పెను సవాళ్లను అధిగమించి పదేళ్లలో రూ.120 కోట్ల సంస్థగా నిలదొక్కుకునేలా చేయడం పట్ల పీఎస్‌ఆర్ టెక్ హబ్ అధినేత పి. శ్రీరంగారావును శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. కరోనా సమయంలో ఎన్నో సంస్థలు మూతపడటమో, నష్టాలకు గురికావడమో జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక ఆవిష్కరణలు, ఏఐ లాంటి సవాళ్లను ఎదుర్కొని 250 మంది ఉద్యోగులకు భరోసానివ్వడం సాధారణ విషయం కాదని కొనియాడారు.
వేగంగా విస్తరిస్తున్న ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేలా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజి నీర్ల నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. ఏఐ హబ్’ పేరుతో ప్రత్యేక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వచ్చే రెండు నెలల్లో రీస్కిల్లింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో కార్యాలయాలను ఏర్పా టు చేసి సేవలను అందిస్తోందని డైరెక్టర్ పీ.నమ్యుత తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశం వెలుపల కార్యాలయాలను విస్తరించి ఉద్యోగుల సంఖ్యను 1,000 కి పెంచుతామని వివరించారు. మంత్రి సూచన మేరకు చదువులు పూర్తయిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. సంస్థ ఉద్యోగులు, క్లయింట్లు, పలువు రు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
యూపీఎస్సీ అభ్యర్థులకు వరంగా ‘ప్రెప్ మంకీ’ యాప్
యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతి కతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్ మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్‌ను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారం భించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతికతను విద్యా రంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చ న్నారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు సరైన మార్గదర్శక త్వం లభిస్తే ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నా రు. ప్రెప్ మంకీ వ్యవస్థాపక బృందంలో తలశిల రంజిత్, సుధాకర్, రామ్ అభినవ్ తేజ్, పావని, ఆకాశ్, మేఘనా రెడ్డి ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ నేపథ్యాల నుంచి వచ్చే అభ్యర్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం, సరైన దిశానిర్దే శంతో విజయా న్ని అందించడం తమ లక్ష్యమన్నారు.






