26 June, 2026 | 10:40 PM

ప్రసిద్ధ రుయ్యాడి సవర్లను దర్శించుకున్న జిల్లా ఎస్పీ

26-06-2026 09:22 PM

తలమడుగు,(విజయక్రాంతి): జిల్లాలో ప్రసిద్ధిగాంచిన రుయ్యడిలో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. హుస్సేన్ దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించి, సవర్ల కు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి వచ్చిన ఎస్పీ కి డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలకారు. ఈ సందర్భంగా సవర్ల ప్రత్యేకత, చరిత్ర, సంసృతి, ఆచారాలను విజయ డైరీ మాజీ ఛైర్మెన్, హస్సేన్ హుస్సేన్ దేవస్థానం అద్యక్షుడు లోక భూమా రెడ్డి ఎస్పీ కి వివరించారు. 

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసికట్టుగా పండుగలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. గ్రామంలో పండుగ దృష్ట్యా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ దైవ క్షేత్రం సర్వమత సమేతంగా నిర్వహించడం అభినందనీయం అని తెలిపారు.