26 June, 2026 | 10:40 PM

జీవో 25ను సవరించాలి

26-06-2026 09:25 PM

- ఉపాద్యాయుల సర్దుబాటు పక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలి

- పీఆర్టీయూ టీఎస్ స్టేట్ సెక్రటరీ అమరేంద్ర సాగర్

జడ్చర్ల: జీఓ 25ను సవరించాలని ప్రభుత్వ పాఠశాలల కుదింపు,ఉపాధ్యాయుల రేషనలైజేషన్, సర్దుబాటు పక్రియను తాత్కాలికంగా వాయిదావేయాలని పీఆర్టీయూ టీఎస్ స్టేట్ సెక్రటరీ అమరేంద్ర సాగర్ ప్రభత్వాన్ని కోరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తో పాటు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ కీలక సమయంలోనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం ఆందోళన కలిగించే అంశం అని అన్నారు.

రాష్ట్రంలోని వేలాది ప్రాథమిక పాఠశాలలు ఇప్పటికీ ఒక్కరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవో నెం.25 ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపడితే, ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాఠశాలలు మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. విద్యార్థుల అడ్మిషన్లను పెంచేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేస్తున్న ఈ సమయంలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించే చర్యలు ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని

అందుకే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రతి తరగతి ఒక ఉపాధ్యాయుణ్ణి నియమించాలని అన్నారు.పాఠశాలల కుదింపు వల్ల బడుగు,బలహీన వర్గాలకు ఉచిత విద్య అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు .ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు.పీఆర్సీ ని వెంటనే తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ తో అమలుచేయాలని పెండింగ్ లో ఉన్న ఐదు డీ ఏ లను తక్షణమే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.