26 June, 2026 | 9:22 PM

Breaking News

ప్రసిద్ధ రుయ్యాడి సవర్లను దర్శించుకున్న జిల్లా ఎస్పీ   •   పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంఎల్ఏ జారే ఆదినారాయణ   •   రిజర్వాయర్లను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అధికార బృందం   •   భద్రాద్రి రామాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభం   •   డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన డీఎస్‌పీ అరుణ్ కుమార్   •   నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం స్వాధీనం   •   'బీబీ-కా-ఆలం' ఊరేగింపులో పాల్గొన్న బండారు దత్తాత్రేయ   •   ఫ్రీ ప్రైమరీ స్కూళ్లకు ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకం   •   మతసామరస్యానికి ప్రతీక మొహరం పండుగ   •   కీతవారిగూడెంలో ఘనంగా అయ్యప్ప స్వామి 15వ వార్షికోత్సవం   •  

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

05-05-2026 12:27 AM

32 మందికి గాయాలు

ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

కొండపాక, మే 4: కుకునూరు పల్లి మండలం లకుడారం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు సంఘటన సోమవారం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు కుకునూరు పల్లి మండలం రాజీవ్ రహదారి లకుడారం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టిన కరీంనగర్-2డిపో బస్సు, కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు సుమారు ఈ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉండగా, 32 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని, విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ లల్లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని అన్నారు.