26 June, 2026 | 10:40 PM

రిజర్వాయర్లను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అధికార బృందం

26-06-2026 09:17 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లను డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం శుక్రవారం పరిశీలించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండవ లిఫ్టు జొన్నలప్ప గూడ రిజర్వాయర్ మూడో లిఫ్ట్ గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నాగర్ కర్నూల్ కేసరి సముద్రం మినీ రిజర్వాయర్ ఆనకట్టలను అధికార బృందం పరిశీలించింది. రిజర్వాయర్ల భద్రత, గేట్ల పనితీరు, ఆనకట్ట నిర్మాణ స్థితి, నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆనకట్టల నిర్వహణ, మరమ్మతులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.